షకీలా ట్రైలర్ మరీ నాసిరకం!

- Advertisement -
Shakeela

షకీలా బయోపిక్ అదిరిపోతుంది అని ఆశపడ్డ వారికి ట్రైలర్ తోనే భంగపాటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ లో పుట్టి కేరళలో శృంగార చిత్రాల క్వీన్ గా ఎదిగిన షకీలా జీవితంలో చాలా డ్రామా ఉంది. ఒకప్పుడు మోహన్ లాల్, మమ్ముట్టి వంటి సూపర్ స్టార్ లు భయపడే రేంజులో కేరళలో క్రేజ్ తెచ్చుకొంది. అలాంటి ఆమె జీవితం ఆధారంగా తీసిన బయోపిక్ మరి నాసిరకంగా ఉంది అనిపిస్తోంది.

ఈ రోజు ట్రైలర్ విడుదల అయింది.

ఇంతకుముందు సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తీసిన “డర్టీ పిక్షర్”కి జీరాక్స్ కాపీలా ఉంది. షకీలాగా నటించిన హీరోయిన్ రిచా చద్దా అస్సలు సూట్ కాలేదు అనిపిస్తోంది. “మీర్జాపూర్” వంటి వెబ్ సిరీస్ లతో క్రేజ్ తెచ్చుకున్న పంకజ్ త్రిపాఠికి ఎక్కువ రోల్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. ఆయన క్రేజ్ ని ఉపయోగించుకుందామనే ప్రయత్నం కాబోలు.

Shakeela - Official Trailer | Richa Chadha | Pankaj Tripathi

ఏ రకంగా చూసిన ఇంద్రజిత్ లంకేశ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ బాగా నిరాశ పర్చింది. ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా విడుదల అవుతోంది షకీలా బయోపిక్.

More

Related Stories