20 ఏళ్ల తర్వాత షాలిని రీఎంట్రీ

20 ఏళ్ల తర్వాత షాలిని రీఎంట్రీ


షాలిని ఒకప్పుడు అగ్ర కథానాయిక. బాలనటిగా కూడా పాపులర్. హీరోయిన్ గా మణిరత్నం తీసిన ‘సఖి’ వంటి హిట్ సినిమాలున్నాయి ఆమె ఖాతాలో. అజిత్ తో ‘అమర్కలం’ (తెలుగులో ‘అద్భుతం’ పేరుతో విడుదలైంది) సినిమా షూటింగ్ లో ప్రేమలో పడి.. పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పారు షాలిని. 2001లో విడుదలైన “ప్రియద వరుమ్ వేండుం” ఆమె హీరోయిన్ గా నటించిన చివరి చిత్రం.

మళ్ళీ ఇన్నేళ్లకు ఆమె వెండితెరపై కనిపించనున్నారు. మణిరత్నం తీస్తున్న ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలో ఆమె ఒక కీలక పాత్రలో కనిపిస్తారట. మణిరత్నం అడిగారు అని ఈ చిన్న పాత్రకి ఒప్పుకున్నారని టాక్.

అజిత్, షాలినిలకు ఇద్దరు పిల్లలు. కూతురు టీనేజ్ లోకి వచ్చింది. షాలిని ఇకపై మరిన్ని సినిమాల్లో నటిస్తారా అనేది చూడాలి. ఆమె భర్త అజిత్ ఇప్పుడు కోలీవుడ్ లో బిగ్ సూపర్ స్టార్. తమిళనాడు లో బాగా మాస్ క్రేజున్న స్టార్స్ ఇద్దరే… ఒకరు అజిత్, మరొకరు విజయ్.

 

More

Related Stories