
షాలిని పాండే గురించి పరిచయం అక్కర్లేదు. ‘అర్జున్ రెడ్డి’ చిత్రంతో బాగా పాపులర్ అయింది. ఆ తర్వాత ‘ఎన్టీఆర్’ బయోపిక్, 118, నిశ్శబ్దం వంటి చిత్రాల్లోనూ కనిపించింది. ఐతే, షాలిని పాండే అంటే మాత్రం ‘అర్జున్ రెడ్డి’ గురించే మాట్లాడుతారు ఎవరైనా.
మొదటి సినిమాలోనే ఆమె ‘కడుపుతో’ ఉన్న పాత్రలో కనిపించింది. కొద్దిసేపే అయినా ఆ పాత్ర పోషించేందుకు యంగ్ హీరోయిన్లు సహజంగా ఒప్పుకోరు. కానీ, రీమా సేన్ లా షాలిని పాండే డేరింగ్ స్టెప్ వేసింది…సక్సెస్ కొట్టింది. ఇప్పుడు మళ్ళీ అలాగే కనిపిస్తోంది షాలిని పాండే.
ఆమె హిందీలో నటిస్తోన్న తొలి చిత్రం.. ‘జయేష్ భాయ్ జోర్దార్’. బాలీవుడ్ అగ్ర హీరో రణవీర్ సింగ్ కథానాయకుడు. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోంది చిత్రాన్ని. ఒక విధంగా చెప్పాలంటే ఆమెకిది డ్రీం డెబ్యూ. కానీ, ఈ సినిమాలో ఆమెది డీగ్లామర్ పాత్ర. ఈ సినిమా ట్రైలర్ బయటికి వచ్చింది. ఈ సినిమాలో ఆమె గర్భిణి పాత్ర పోషించినట్లు కనిపిస్తోంది.
మరి, హిందీలో కూడా ఈ ‘కడుపుతో ఉన్న యువతి’ పాత్ర సక్సెస్ ని తెస్తుందా అన్నది చూడాలి.