అక్కకు బాధలు… చెల్లికి ఆఫర్లు!

- Advertisement -
Shamita Shetty


శిల్ప శెట్టి చెల్లెలు షమిత శెట్టి మళ్ళీ బిజీ అవుతోంది. తెలుగులో ‘పిలిస్తే పలుకుతా’ వంటి చిత్రాల్లో నటించిన షమిత శెట్టికి మన టాలీవుడ్ హీరో రానా ఒక పెద్ద ఛాన్స్ ఇచ్చినట్లు టాక్.

ఆమె అక్క శిల్ప శెట్టి బాధలో ఉంది. శిల్ప భర్త రాజ్ కుంద్రా పోర్న్ చిత్రాల కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. దాంతో శిల్ప శెట్టి తన టీవీ షోలను కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఇలాంటి టైంలో ఆమె చెల్లెలు బిజీ కావడం విశేషం.

షమిత ఇప్పుడు ఓటిటిలో స్ట్రీమ్ అవుతున్న “బిగ్ బాస్” షోలో పాల్గొంటోంది. లేటెస్ట్ గా రానా కూడా ఒక వెబ్ సిరీస్ అఫర్ చేసినట్లు సమాచారం. వెంకటేష్, రానా కాంబినేషన్ లో హిందీలో ఒక వెబ్ సిరీస్ తెరకెక్కనుంది. నెట్ ఫ్లిక్స్ కోసం రానా ఈ సిరీస్ ని సెట్ చేశాడు. ఇందులో ఒక పాత్రలో షమితని తీసుకున్నట్లు టాక్.

Also Read: నెల తర్వాత బయటికొచ్చిన శిల్ప

 

More

Related Stories