చరణ్ తో పాటు రణ్వీర్ సింగ్!

Shankar

శంకర్ తన నెక్స్ట్ సినిమా రామ్ చరణ్ హీరోగా ఉంటుంది. ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది. దిల్ రాజు నిర్మిస్తారు. జులైలో షూటింగ్ మొదలవుతుంది. ఇది పక్కాగా కుదిరిన ప్రాజెక్ట్. శంకర్ ఇప్పటికే రైటర్ బుర్రా సాయి మాధవ్ తో స్క్రిప్ట్ వర్క్ షురూ చేశారన్న విషయాన్నీ తెలుగుసినిమా.కామ్ ఇప్పటికే అప్డేట్ చేసింది.

లేటెస్ట్ గా శంకర్ హిందీ సినిమాపై కూడా ప్రచారం సాగుతోంది.

రణ్వీర్ సింగ్ హీరోగా ఒక బాలీవుడ్ చిత్రం తీయాలని శంకర్ చాలా కాలంగా అనుకుంటున్న మాట వాస్తవమే. అది కూడా ఇప్పుడు మెటియరలైజ్ అయింది అని బాలీవుడ్ మీడియా రాస్తోంది. ‘అపరిచితుడు’ సినిమాని కొంచెం మార్చి హిందీలో పెద్ద ఎత్తున తీయాలని అనుకుంటున్నారట శంకర్.

తమిళ న్యూ ఇయర్ (ఏప్రిల్ 14) నాడు ఈ సినిమా ప్రకటన ఉంటుంది.ఐతే, ఇది ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో క్లారిటీ లేదు. రామ్ చరణ్ సినిమా పూర్తి కావాలంటే ఎంత లేదన్నా ఏడాది పైనే పడుతుంది.

More

Related Stories