శంకర్ 160 కోట్ల వివాదం తేలేనా!

Shankar

శంకర్ – రామ్ చరణ్ సినిమా మొదలు కావడం కష్టమే. ఇటీవలే చరణ్, శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాతగా సినిమా ప్రకటన వచ్చింది. ఐతే, అనేక లీగల్ సమస్యల కారణంగా ఇది ఇప్పట్లో జరిగేలా లేదు.

ఎందుకంటే… ‘భారతీయుడు 2’ సినిమా పూర్తి చెయ్యకుండా శంకర్ మరో సినిమా మొదలుపెట్టొద్దని అంటోంది లైకా ప్రొడక్షన్స్. ఈ సంస్థ ఇప్పటికే శంకర్ తో “2.0” సినిమా నిర్మించింది. ఇప్పుడు ‘భారతీయుడు 2’ తీస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై 160 కోట్లు ఖర్చుపెట్టింది. ఐతే, ఆ సంస్థతో శంకర్ కి విభేదాలు వచ్చాయి. సినిమా షూటింగ్ చెయ్యడం లేదు శంకర్.

‘భారతీయుడు 2’ని పక్కన పెట్టి చరణ్ తో తెలుగులో ఒకటి, రణ్వీర్ సింగ్ హీరోగా హిందీలో ‘అపరిచితుడు’ రీమేక్ సినిమా అనౌన్స్ చేశారు శంకర్. ఇప్పుడు లైకా కోర్టులో వేసిన కారణంగా శంకర్ దూకుడుకు బ్రేకులు పడ్డాయి. ‘భారతీయుడు 2’ సినిమాపై ఇప్పటివరకు పెట్టిన 160 కోట్ల రూపాయల ఖర్చు పెట్టింది శంకర్ చెల్లించాలి. లేదంటే సినిమా పూర్తి చెయ్యాలి అని లైకా వాదిస్తోంది.

తాజాగా హీరో కమల్ హాసన్ రంగంలోకి దిగారు. ఆయన ఇరుపక్షాల మధ్య రాజీ కుదిరేలా చూస్తున్నారు. కమల్ రాజీ ఫార్ములా వర్కౌట్ ఐతే శంకర్ ‘భారతీయుడు 2’ సినిమాని స్పీడ్ గా పూర్తి చేసి తర్వాతే రామ్ చరణ్ సినిమాని చేపట్టాలి.ఈ వివాదం ఇప్పట్లో తేలదు. సో.. రామ్ చరణ్ సినిమా కూడా పక్కకు వెళ్ళినట్లే.

Advertisement
 

More

Related Stories