వివేక్ సీన్లు అన్ని మళ్ళీ తీయాలా?

తమిళ హాస్య నటుడు వివేక్ ఇటీవల గుండెపోటుతో మరణించారు. ఆయన మృతి తమిళ సినిమా ఇండస్ట్రీకి షాక్. మొన్నటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న వివేక్ కి అలా జరగడంతో ఇప్పటికీ ఆయనతో అనుబంధం ఉన్న ఫిలిం మేకర్స్ ఇంకా తేరుకోలేకపోతున్నారు. దాంతో పాటు ఇప్పుడు మరో సమస్య వచ్చింది.

శంకర్ సినిమాల్లో రెగ్యులర్ గా నటించే వివేక్ కి … ఆయన తీస్తున్న ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2) సినిమాలో మంచి పాత్ర దక్కింది. కమల్ హాసన్, వివేక్ మధ్య చాలా సీన్లు తీశారట శంకర్. కమల్ తో వివేక్ నటించడం ఇదే ఫస్ట్ టైం. ఐతే, ఈ సినిమా ఇంకా పూర్తి కాలేదు. మధ్యలోనే ఆగిపోయింది. ఈ విషయంలో నిర్మాతలు కోర్టుకు ఎక్కారు. తమ సినిమా పూర్తి చెయ్యకుండా శంకర్ … రామ్ చరణ్ తో తెలుగు సినిమా తీయకుండా చూడాలని ఆ నిర్మాతలు మద్రాస్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు.

ఈ కేసు ఈ రోజు మరోసారి విచారణకి వచ్చింది. వివేక్‌ మృతి చెందడంతో ఈ సీన్లన్నీ మళ్లీ తీయాలని శంకర్‌ కోర్టుకు తెలిపారు. అది పెద్ద సమస్య అని, అది ఇప్పట్లో ముగిసే సినిమా కాదని శంకర్ చెప్పారు. కాబట్టి తనని ఈ సినిమాతో బంధించిడం కరెక్ట్ కాదనేది శంకర్ వాదన. మరి ఈ “భారతీయుడు 2” ఎలా పూర్తి అవుతుంది? అదే పెద్ద సమస్య.

ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు దర్శకుడు, నిర్మాతలు తమలో తామే సమస్యని పరిష్కరించుకోవాలని సూచించింది. ఈ విషయం ఈ నెలాఖరులో కోర్టుకు తెలిపాలి.

More

Related Stories