డైరెక్టర్ ని మార్చేసిన హీరో

Sharwanand


శర్వానంద్ వరుసగా అపజయాలు ఎదుర్కొన్నాడు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఆయనకి ఒక విజయం దక్కింది. గతేడాది ‘ఒకే ఒక జీవితం’ ఆయన ఫ్లాపుల వరదకు ఆనకట్ట వేసింది. దాంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఆ సినిమా విజయం తర్వాత తన నిర్ణయాలు మార్చుకున్నాడు.

దర్శకుడు కృష్ణ చైతన్య చెప్పిన కథ నచ్చి సినిమాని గ్రాండ్ గా లాంచ్ చేసిన తర్వాత శర్వానంద్ దాన్ని ఇప్పుడు పక్కన పెట్టాడు. ఆ దర్శకుడు చెప్పిన కథ ఇప్పుడు తనకు రిస్క్ అని భావించాడట. ‘ఒకే ఒక జీవితం’ సినిమా విజయం తర్వాత జనాలు తన నుంచి ఎలాంటి సినిమాలు ఆశిస్తున్నారో తెలిసి వచ్చిందట. అందుకే, ప్రారంభం ఐన చిత్రాన్ని ఆపేశాడు.

కాకపోతే, అదే నిర్మాతలకు వేరే దర్శకుడితో మూవీ చేసేందుకు అంగీకరించాడు శర్వానంద్. ‘భలే మంచి రోజు’, ‘హీరో’ వంటి సినిమాలు తీసిన శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో కొత్త సినిమా చెయ్యనున్నాడు. అలా దర్శకుడిని మార్చి నిర్మాతలకు బర్డెన్ లేకుండా చేశాడు శర్వానంద్.

ఇటీవలే ఈ కుర్ర హీరోకి ఒక అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. త్వరలోనే పెళ్లి. వివాహ వేడుక పూర్తి అయిన తర్వాత శ్రీరామ్ ఆదిత్యతో సినిమా ప్రకటిస్తాడని టాక్.

 

More

Related Stories