శర్వానంద్ కూడా స్టార్ట్ చేశాడు

Sharwanand

హీరోలంతా ఒక్కొక్కరుగా సెట్స్ పైకి వస్తున్నారు. ఇప్పుడు శర్వానంద్ వంతు. ఈ హీరో కూడా తన కొత్త సినిమాను స్టార్ట్ చేశాడు. శ్రీకార్తీక్ దర్శకత్వంలో తెలుగు-తమిళ భాషల్లో శర్వానంద్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా షూటింగ్ చెన్నైలో మొదలైంది.

ఈ సినిమాకు సంబంధించి ఇదే ఆఖరి షెడ్యూల్. ఈ మూవీకి ఇంకా పేరు పెట్టలేదు. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తిచేసి, ఆ తర్వాత “శ్రీకారం” మూవీ రీ-స్టార్ట్ చేయబోతున్నాడు శర్వ.

నితిన్ టైపులోనే శర్వానంద్ కూడా ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రిలీజ్ చేద్దాం అనుకున్నాడు. ఈ ఇయర్ ప్రారంభంలో “జాను” సినిమాను విడుదల చేసిన శర్వా.. ఆ వెంటనే 4 నెలల గ్యాప్ లో మరో సినిమాను రిలీజ్ చేసి, ఏడాది చివరికి ఇంకో సినిమాతో థియేటర్లలోకి రావాలని పక్కా ప్లాన్స్ వేసుకున్నాడు.

కానీ కరోనా వచ్చి అతడి ప్లానింగ్ మొత్తాన్ని దెబ్బకొట్టింది. అలా ఆగిపోయిన సినిమాల్ని ఇప్పుడు ఒక్కొక్కటిగా నిదానంగా పూర్తిచేసే పనిలో పడ్డాడు ఈ యంగ్ హీరో.

Related Stories