
శర్వానంద్ పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉంది. ‘శ్రీకారం’తో కెరీర్ గాడిలో పడుతుంది అనుకుంటే సాధ్యం కాలేదు. ‘జాతిరత్నాలు’ బాక్సాఫీస్ని షేక్ చేసి అతని ఆశలకు గండికొట్టింది. ‘పడి పడి లేచే మనసు’తో మొదలైంది ఫ్లాప్ల పరంపర. ‘రణరంగం’, ‘జాను’ ఘోరంగా పోయాయి. ‘శ్రీకారం’ వీటితో పోల్చితే బెటర్.
‘శ్రీకారం’ సినిమాలో సందేశం బాగుంది అని పేరు వచ్చింది. ఐతే, కథనం విషయంలోనే ఈ మూవీ తడబడింది. కారణం ఏదైనా…రిజల్ట్ పాజిటివ్ కాదు. దాంతో శర్వానంద్కి ఇప్పుడు పెద్ద డైలమా. ఏమి చేసి నెక్స్ట్ హిట్ కొట్టాలి అనేది అతని ప్రధాన సమస్య.
విడుదలకు మరో మూడు, నాలుగు సినిమాలున్నాయి. ఒక తమిళ, తెలుగు చిత్రం ఈ సమ్మర్ లోనే విడుదలవుతుంది. ఆగస్టులో ‘మహాసముద్రం’ విడుదల కానుంది. వచ్చే ఏడాది ‘ఆడాళ్ళూ మీకు జోహార్లు’ రిలీజ్ అవుతుంది. చివరి రెండు చిత్రాలతో కెరీర్ సెట్ అవుతుంది అని నమ్మకంగా ఉన్నాడు.