మొత్తానికి మారిపోయిన శర్వానంద్

Sharwanand


ఇటీవల శర్వానంద్ కి అన్నీ అపజయాలే. ఒక్కటంటే ఒక్క మూవీ పర్వాలేదు అనిపించుకోలేదు. ఫ్లాపులతో పాటు ఆయన లుక్ పై విమర్శలు కూడా వచ్చాయి.

ముఖ్యంగా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు” చిత్రంలో పూర్తిగా షేప్ అవుట్ అయినట్లు కనిపించడంతో సోషల్ మీడియాలో బాగా కామెంట్స్ పడ్డాయి. దాంతో, స్లిమ్ గా మారి మేకోవర్ చేయించుకోవాలని ఒక దీక్ష పట్టినట్లు ఆర్నెల్ల క్రితం వార్తలు వచ్చాయి. ఆ ప్రచారం నిజమే అని తేలిందిప్పుడు.

డైట్, ఫిట్నెస్ ఎక్సర్ సైజుల వంటి కసరత్తులు పనిచేశాయి. ఇప్పుడు ఆయన మొత్తం మారిపోయారు శర్వానంద్. తన లేటెస్ట్ లుక్ అదిరింది అని అభిమానులు ఆనందంగా కొత్త ఫొటోలను షేర్ చేస్తున్నారు. నిజంగానే, శర్వానంద్ స్లిమ్ గా, హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు.

మరోవైపు, శర్వానంద్ నటించిన ‘ఒకే ఒక జీవితం’ అనే సినిమా వచ్చే నెల విడుదల కానుంది. ఇది మూడేళ్ళుగా పెండింగ్ లో ఉంది. ఈ సినిమా విడుదలైతే శర్వానంద్ కరోనాకి ముందు ఒప్పుకున్నా సినిమాల బ్యాచ్ మొత్తం పూర్తి అవుతుంది. ఇక ఇప్పుడు ఫ్రెష్ గా కొత్త సినిమాలు సైన్ చెయ్యాలి.

 

More

Related Stories