శర్వానంద్-రాశిఖన్నా కాంబోలో సినిమా

మరో కాంబినేషన్ సెట్ అయింది. శర్వానంద్ సినిమాలో రాశిఖన్నా నటించబోతోంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇదే తొలి సినిమా. పీపుల్ మీడియా బ్యానర్ పై త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది ఈ మూవీ.

మొన్నటివరకు నితిన్ కాంపౌండ్ లో ఉన్న కృష్ణ చైతన్య ఆ కాంపౌండ్ నుంచి బయటకొచ్చాడు. పవర్ పేట ప్రాజెక్టు ఆగిపోవడంతో, శర్వానంద్ దగ్గరకు చేరాడు. కృష్ణ చైతన్య చెప్పిన స్టోరీకి శర్వా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా ఈ ప్రాజెక్టు సెట్ అవ్వడం, అందులోకి రాశి ఖన్నా రావడం చకచకా జరిగిపోయాయి.

ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమా ప్రమోషన్ లో ఉంది రాశిఖన్నా. అది పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్టులోకి చేరుతుంది. అటు శర్వానంద్ మాత్రం మేకోవర్ పనుల్లో ఉన్నాడు. ఈమధ్య కాస్త లావెక్కిన ఈ హీరో, బరువు తగ్గే పనిలో ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా లాంఛ్ అవుతుంది. 

 

More

Related Stories