బాగుందనే ఫీడ్ బ్యాక్ వచ్చింది: శర్వా

- Advertisement -
Sharwanand


శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మందన్న న‌టించిన ‘ఆడ‌వాళ్ళు మీకు జోహార్లు’ శుక్ర‌వారం నాడు విడుద‌లయింది. ఇది ఫ్యామిలీ ఎంటర్ టైనర్. క్రిటిక్స్, రేటింగ్స్ పక్కన పెడితే సినిమాకి ప్రేక్షకుల నుంచి మాత్రం మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందట. ఈ సినిమా టీం శ‌నివారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది.

తన మిత్రులు, కుటుంబసభ్యులు కూడా మెచ్చుకున్నారని చెప్పారు శర్వానంద్.

“మేం విడుద‌ల‌కు ముందు ఏదైతే అనుకున్నామో అది నేడు జ‌రిగింది. చాలా సంతోషంగా వుంది. నా కుటుంబ‌స‌భ్యులుతోపాటు స్నేహితులు కూడా సినిమా చూసి బాగుంద‌న్నారు. ఇది బాగోలేద‌ని ఒక్క‌రూ కూడా అన‌డం నేను విన‌లేదు. మేం న‌వ్విస్తామ‌ని చెప్పాం. అలాగే థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కులు న‌వ్వుతూనే వున్నారు. హ్యాపీగా చాలా రోజుల త‌ర్వాత థియేట‌ర్‌కు వ‌చ్చి ఎంజాయ్ చేస్తున్నామ‌ని ప్రేక్ష‌కులు చెబుతున్నార,”ని అన్నారు శర్వానంద్.

రష్మిక కూడా అదే మాట చెప్పింది.

“విడుద‌ల రోజు మా అమ్మ నాన్న థియేట‌ర్లో సినిమా చూశారు. ఒక మంచి సినిమా చూశామ‌నే ఫీలింగ్‌ వచ్చిందన్నారు. మ‌న కుటుంబంలోని వ్య‌క్తులు ఈ సినిమాలోని పాత్ర‌లు ద్వారా మ‌న క‌ళ్ళ ముందు క‌నిపిస్తారు. నిన్న కొన్ని థియేట‌ర్ల‌కు వెళ్ళాం. అక్క‌డ అంతా ఫ్యామిలీ తోనే సినిమాకు వ‌చ్చారు,” అని చెప్పింది రష్మిక.

 

More

Related Stories