14 కిలోలు తగ్గాను: శర్వానంద్


యువ హీరో శర్వానంద్ గుండెలపై భారం పోయింది. వరుస అపజయాలతో మొన్నటి వరకు నిత్యం టెన్షన్. తాజాగా విడుదలైన ‘ఒకే ఒక జీవితం’ పాస్ అయిపోయింది. మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో, ఆనందంగా, ఫ్రెష్ గా కనిపిస్తున్నారు శర్వా.

‘ఒకే ఒక జీవితం’ సక్సెస్ ఈ నేపధ్యంలో శర్వానంద్ విలేఖరుల సమవేశంలో పాల్గొని తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు.

సన్నగా కనిపిస్తున్నారు, ఫ్రెష్ గా ఉన్నారు అన్న ప్రశ్నకి, “14 కిలోలు తగ్గాను. తక్కువ తింటున్నాను” అని సమాధానం వచ్చింది. సక్సెస్ ఇచ్చిన ఆనందం వల్లే ముఖంలో మళ్ళీ కళ కనిపిస్తోంది.

“ఈ సినిమా విడుదలకు ముందు చాలా టెన్షన్ పడ్డాను. విమర్శకులు ఏమంటారో అని భయపడ్డా. టైం ట్రావెల్ కథ, లాజిక్ ల గురించి ఆలోచిస్తారు, పట్టుకుంటారు అని అనుకున్నా. కానీ, విమర్శకులు ఎక్కువ మెచ్చుకున్నారు. ఇక కలెక్షన్లు పెద్గగా ఉన్నాయా లేవా అనేది కాకుండా ఎక్కువ రోజుల రన్ ఉంటుంది అని నమ్ముతున్నా. మొదటివారం డీసెంట్ గా ఆడింది. రెండో, మూడో వారంలో కూడా బాగానే ఆడుతుంది అని అనుకుంటున్నా,” అని వివరించారు.

“కృష్ణ చైతన్యతో ఒక సినిమా చేస్తున్నా. ఇది పొలిటికల్ డ్రామా. మరో మూడు కథలు ఫైనల్ అయ్యాయి. ఆ వివరాలు త్వరలోనే చెప్తా, ” అని ముగించారు శర్వానంద్.

 

More

Related Stories