మేకప్ తో శర్వా రెడీ!

Sharwanand

దాదాపు ఆరు నెలల పాటు హీరోలందరూ ఇంటిపట్టునే కూర్చున్నారు. సినిమా ఇండస్ట్రీ మొత్తం ఇన్ని నెలలు పనులు బంద్ పెట్టడం చరిత్రలో ఇదే మొదటిసారి కాబోలు.

ఇంకా కరోనా కేసులు తగ్గలేదు… కానీ హైదరాబాద్ కుదురుకుంటున్నట్లు కనిపిస్తోంది. మొన్నటివరకు టెస్ట్ లు తక్కువ చేస్తున్నారు అన్న బాడ్ నేమ్ తెచ్చుకొంది తెలంగాణ ప్రభుత్వం. ఐతే గత కొద్దీ రోజులుగా రోజుకు 50 వేల టెస్టింగ్ లు చేస్తోంది. ఇంత రేంజ్ లో టెస్టులు చేసినా హైదరాబాద్ లో వెయ్యి లోపు కేసులు నమోదు అవుతున్నాయి. అంటే.. ఇంకా పూర్తిగా తగ్గడానికి చాలా టైం పడుతుంది. కానీ గ్రోత్ రేట్ తగ్గుతుండడం మంచి పరిణామం.

అందుకే, షూటింగ్ లకు రెడీ అవుతున్నారు కొందరు కుర్ర హీరోలు.

ప్రభాస్ తన “రాధే శ్యామ్” షూటింగ్ ని వచ్చేనెల 15 నుంచి రామోజీ ఫిలిం సిటీ లో మొదలు పెడుతాడట. అలాగే శర్వానంద్ కూడా మేకపు వేసుకునేందుకు రెడీ అవుతున్నాడు. వచ్చే నెల… శర్వానంద్ నటిస్తున్న “శ్రీకారం” సినిమా షూటింగ్ మళ్లీ శ్రీకారం చుట్టనుంది. ఇప్పటివరకు ఖచ్చితంగా షెడ్యూలు రెడీ చేసుకున్న సినిమాలు ఇవే.

Related Stories