టెకీ భామతో శర్వా పెళ్లి?

Sharwanand

టెకీ భామతో శర్వా పెళ్లి?
హీరో శర్వానంద్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఇన్నాళ్లూ పెళ్లి మాట ఎత్తగానే టాఫిక్ ని డైవర్ట్ చేస్తూ వచ్చిన శర్వానంద్ ఇప్పుడు ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్లాడనున్నాడు అని మీడియా వార్తలు తెలియచేస్తున్నాయి.

శర్వానంద్ కి 38 ఏళ్ళు ఇప్పుడు. ఇంట్లో పెళ్లి విషయంలో చాలా ఒత్తిడి ఉంది. ఇప్పుడు ఓకే చెప్పాడట. ఐతే, ప్రేమించిన అమ్మాయినే పెళ్లాడనున్నాడు అనేది టాక్. అమెరికాలో పని చేస్తున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో కొంతకాలంగా శర్వా ప్రేమలో ఉన్నాడట. ఇప్పుడూ ఇద్దరూ జంటగా ఏడడుగులు వేసేందుకు నిర్ణయం తీసుకున్నారట.

ఈ మాఘమాసంలోనే శర్వానంద్ పెళ్లి ఉండనుంది. త్వరలోనే అధికారికంగా ప్రకటన విడుదల చేయనున్నాడు.

ఇటీవలే శర్వానంద్ కెరీర్ కొంచెం గాడిలో పడింది. ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో హిట్ అందుకున్నాడు.

 

More

Related Stories