మొత్తానికి తగ్గుతున్నాడట శర్వా

- Advertisement -
Sharwanand


ఫిట్నెస్ విషయంలో శర్వానంద్ వీక్ గా ఉన్నాడు అని ఆయన ఇటీవలి చిత్రాలు చూస్తే అర్థం అవుతుంది. ముఖ్యంగా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ సినిమాలో చాలా చోట్లా పొట్టతో కనిపించాడు. ముఖం కూడా ఉబ్బింది.

ఇంకా 40 దాటలేదు అతని వయసు. అప్పుడే ఇలా అవుట్ అఫ్ షేప్ అయితే ఎలా అని కామెంట్స్ వినిపించాయి. బహుశా ఆయన కూడా ఈ విషయాన్ని గ్రహించి ఉంటాడు. ఇప్పుడు లావు తగ్గి, మంచి ఫిట్ నెస్ సాధించే పనిలో ఉన్నాడని మీడియా వార్తలు చెప్తున్నాయి. ఇక కథల విషయంలో కూడా కొంచెం సీరియస్ గా ఆలోచించి సెలెక్ట్ చేసుకుంటే… ఫలితం బాగుంటుంది.

ఆయన టాలెంట్ కి తగ్గ హిట్ వచ్చి చాలా కాలమే అయింది.

శర్వానంద్ ప్లాపుల లిస్ట్ పెరిగిపోతూనే ఉంది. దీనికి అడ్డుకట్ట వేసి మళ్ళీ ఫామ్ లోకి రావాలంటే ఫిట్నెస్ తో పాటు బెటర్ స్టోరీస్ కూడా కావాలి.

 

More

Related Stories