మనీ కోసమా? ఇంప్రెషన్ కోసమా?

Sharwanand

ఏడాదికి ఒక సినిమా కూడా చేసేందుకు వంద ఆలోచించే శర్వానంద్ సడెన్ గా ఎందుకు మారిపోయాడు? ఒకేసారి మూడు సినిమాలు మొదలు పెట్టాడు. డబ్బుల కోసమా? లేదా రేసులో వెనుకబడిపోయాననే ఫీలింగ్ కి వచ్చాడా?

ప్రస్తుతం ”శ్రీకారం” సెట్స్ పై ఉంది. తెలుగు-తమిళ భాషల్లో రీతూవర్మ హీరోయిన్ గా చేస్తున్న ఓ బై-లింగ్వుల్ సినిమా కూడా సెట్స్ పై ఉంది. అజయ్ భూపతి దర్శకత్వంలో ”మహాసముద్రం” అనే సినిమా కూడా చేస్తున్నాడు.వీటికి తోడు తాజాగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడాళ్లు మీకు జోహార్లు’ అనే ప్రాజెక్టు కూడా మొదలు పెట్టాడు.

అలాగే శ్రీరామ్ అనే కొత్త కుర్రాడ్ని దర్శకుడిగా పరిచయం చేస్తూ యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయబోతున్నాడు శర్వా. నిజానికి ఈ ప్రాజెక్టు చాన్నాళ్లుగా నలుగుతోంది. ఇన్నాళ్లకు ఫైనల్ అయింది. త్వరలోనే ఈ ప్రాజెక్టును కూడా ఎనౌన్స్ చేయబోతున్నాడు శర్వానంద్. అంటే రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయ్, మరో మూడు లైన్లో పెట్టాడు.

శర్వానంద్ రీసెంట్ గా నటించిన సినిమాలు బోల్తాకొట్టాయి. “పడి పడి లేచే మనసు”, “రణరంగం”, “జాను”… ఇలా వరుస అపజయాలు. దాంతో తన కెరీర్ డౌన్ లోకి వెళ్తోంది అని శర్వా ఫీల్ అవుతున్నాడట. మార్కెట్ లో తనకి ఇప్పటికి ఫుల్ గా డిమాండ్ ఉందని చెప్పాలనే వరుసగా సినిమాలు షురూ చేసినట్లు టాక్.

Related Stories