శర్వానంద్ కి ఫిబ్రవరి భయం!

Sharwanand

శర్వానంద్ నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు. కానీ ఏ సినిమాని ఎప్పుడు విడుదల చెయ్యాలనే విషయంలో మాత్రం కన్ ఫ్యూజన్లో పడ్డాడు. సంక్రాంతికి “శ్రీకారం” తీసుకురావాలని అనుకున్నాడు. కానీ కుదరలేదు. ఇప్పుడు ఈ సినిమాని ఫిబ్రవరిలో రిలీజ్ చెయ్యాలా? లేక సమ్మర్లోనా అన్న విషయంలోనే తర్జన భర్జన.

14 రీల్స్ ప్లస్ సంస్థ “శ్రీకారం” సినిమాని నిర్మిస్తోంది. శర్వానంద్ ఇందులో ఆదర్శ రైతు పాత్రలో దర్శనమిస్తాడు. షూటింగ్ మొత్తం పూర్తి అయింది.

ఐతే, శర్వానంద్ ఇంతకుముందు మూడు అపజయాలు చూశాడు. “పడి పడి లేచే మనసు”, “రణరంగం”, “జాను”…దారుణంగా పరాజయం పొందడంతో రిలీజ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. సంక్రాంతికి నాలుగు సినిమాలు పోటీ పడుతుండడంతో తప్పుకున్నాడు. గతేడాది “జాను” సినిమా ఫిబ్రవరిలోనే విడుదలై అపజయం పాలు అయింది. అందుకే ఈ సినిమాని ఫిబ్రవరిలో రిలీజ్ చేయొద్దని నిర్మాతలను కోరాడట. ఫిబ్రవరి కూడా మిస్ ఐతే ఈ మూవీ వచ్చేది ఇక వేసవి సెలవుల్లోనే.

More

Related Stories