2022 దీపావళికి హిందీ ‘అల’

Shehzada


తెలుగులో సంచలనం సృష్టించిన మూవీ… ‘అల వైకుంఠపురంలో’. అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది. త్రివిక్రమ్ రేంజ్ ని మరింత పెంచింది. తమన్ ఈ సినిమాతో ఒక్కసారిగా టాప్ మ్యూజిక్ డైరెక్టర్ చైర్ లో కూర్చున్నాడు. ఇప్పుడు ఈ మూవీ హిందీలో రీమేక్ కానుంది.

హిందీలో ఈ సినిమాని ‘షెహజాదా’ (రాకుమారుడు) అనే పేరుతో రీమేక్ చెయ్యనున్నారు. నవంబర్ 4, 2022న విడుదల చేస్తామని తాజాగా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. కార్తీక్ ఆర్యన్, కృతి సనాన్ జంటగా నటిస్తున్నారు. రోహిత్ ధావన్ దర్శకుడు. కార్తీక్ ఆర్యన్ ఇప్పటికే ‘బుట్ట బొమ్మ’ తెలుగు సాంగ్ కి డ్యాన్స్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో వీడియోలు పెట్టుకున్నాడు. ఈ తెలుగు సినిమా అతనికి అంతగా నచ్చిందంట.

కథలో పెద్దగా మార్పులు చేయకుండా పకడ్బందీగా తీస్తున్నామని రోహిత్ ధావన్ అంటున్నారు.

ఇంతవరకు త్రివిక్రమ్ తెలుగులో తీసిన బ్లాక్ బస్టర్ చిత్రాలేవీ ఇతర భాషల్లో ఆడలేదు. ఆయన సినిమాల ఆధారంగా తమిళ, హిందీ భాషల్లో తీసిన రీమేకులు అన్ని నిర్మాతలకు మేకులై గుచ్చుకున్నాయి. మరి ఇది దాన్ని మార్చుతుందా అనేది చూడాలి.

 

More

Related Stories