శిల్పాశెట్టి కాలు విరిగింది!

హీరోయిన్ శిల్పాశెట్టి కాలు జారింది. అదేనండి…. సెట్లో ఆమె కాలు జారింది. చిన్న బెణుకు అనుకుంటే పెద్ద దెబ్బ అని తేలింది. ఆరు వారాల పాటు రెస్ట్ తీసుకోవాలి అని డాక్టర్లు చెప్పారు.

‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది ఈ 47 ఏళ్ల సుందరి. ఇది యాక్షన్ డ్రామా. దర్శకుడు రోహిత్ శెట్టి ఆమెపై ఒక ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా ఆమె కాలు బెణికింది.

“కాలు ఇరగ్గొట్టు అని దర్శకుడు యాక్షన్ చెప్పాడు. కానీ నా కాలు విరిగింది,” అని శిల్ప ఇన్ స్టాగ్రామ్లో రాసుకొంది.

అమెజాన్ ప్రైమ్ కోసం దర్శకుడు ఈ వెబ్ సిరీస్ తీస్తున్నాడు. సిద్దార్థ్ మల్హోత్రా, వివేక్ ఒబెరాయ్ నటిస్తున్న ఈ సిరీస్ లో ఆమె కూడా ఒక పాత్ర పోషిస్తోంది. 47 ఏళ్ళు వచ్చినా సూపర్ ఫిట్ నెస్ తో ఉంటుంది శిల్ప. అందుకే, ఆమెకి ఈ యాక్షన్ రోల్ ఇచ్చారు దర్శకుడు రోహిత్ శెట్టి. ఐతే, ఈ ఫైట్ సీన్లో ఆమె కాలు విరిగింది.

శిల్పతో అవసరంలేని షూటింగ్ కంటిన్యూ చేస్తున్నారట.

 

More

Related Stories