
పోర్న్ చిత్రాల కేసులో శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్ అయ్యారు. అశ్లీల చిత్రాలు నిర్మించి పలు యాప్‌ల్లో పెట్టి రాజ్ కుంద్రా కోట్లు ఆర్జిస్తున్నారనేది ఆరోపణ. ఆయన అరెస్ట్ అయ్యాక పలు కొత్త కోణాలు బయటపడుతున్నాయి. పలువురు హీరోయిన్లు ఆయన బాధితులమని చెప్తున్నారు.
ఒకసారి నగ్నంగా ఆడిషన్ ఇవ్వమని రాజ్ కుంద్రా తనని అడిగారని నటి సాగరిక ఆరోపించారు. తనని డబ్బుల పరంగా మోసం చేశాడని పూనమ్ పాండే పేర్కొన్నారు. ఈ కేసుని తవ్వేకొద్దీ అనేక పాత్రలు, విషయాలు బయట పడుతున్నాయి అని ముంబై పోలీసులు హిట్ ఇస్తున్నారు. ఐతే, శిల్పా పాత్ర ఈ కేసులో లేదని ప్రాథమిక పరిశోధనలో తేలిందట.
ప్రస్తుతానికి శిల్ప సేఫ్. ఐతే, ఆమె పరువు మాత్రం పోయింది. ఆమె భర్త రాజ్ కుంద్రా చుట్టే ఉచ్చు బిగిస్తోంది.
ALSO READ: శిల్పాశెట్టికి పెద్ద షాక్
మరోవైపు, మరో హీరోయిన్ గెహెనా మరో మాట చెప్తోంది. ఈ యాప్ లలో పోస్ట్ చేసే వీడియోస్ ని పోర్న్ చిత్రాలుగా చూడొద్దని, అవి ఏరోటికా కిందికి వస్తాయని, అది నేరం కాదని అంటోంది గెహెనా. ఎరొటికా వేరు, పోర్న్ వేరు అనేది ఆమె వాదన.