
శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా నీలిచిత్రాల నిర్మాణం, సెక్స్ యాప్ ల నిర్వహణ కేసులో జైల్లో మగ్గుతున్నారు. మూడు నెలల తర్వాత కూడా బెయిల్ రాలేదు. తాజాగా ఆయనపై 1500 పేజీల చార్జిషీట్ ని దాఖలు చేశారు ముంబై పోలీసులు. విచారణలో భాగంగా శిల్పాశెట్టి చెప్పిన దాన్ని కూడా ఈ ఛార్జిషీట్లో రాశారు పోలీసులు. తన భర్త వ్యాపారంలో తాను ఎప్పుడూ కలగచేసుకోలేదని స్పష్టం చేసింది శిల్పాశెట్టి.
ఆమె పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ ఇదే…
“మా ఆయన వ్యాపారం గురించి నేను పట్టించుకోలేదు. ఆయన పని ఆయన చేసుకునేవారు, నా పనిలో నేను బిజీగా ఉండేదాన్ని. నా టీవీ షోలు, యోగ కార్యక్రమాలు, ఇల్లు… ఇలా నేను బిజీగా గడిపేదాన్ని. కాబట్టి ఆయన సంపాదన గురించి ఆలోచించలేదు. ఆయన హాట్ షాట్స్, బాలీ ఫేమ్ వంటి యాప్స్ వ్యాపారం చేస్తున్నాడు అన్న విషయం నాకు తెలీదు.”

శిల్పాశెట్టి కూడా ఇక తన భర్త కేసు గురించి ఆలోచించడం మానేసింది. ఆమె తిరిగి టీవీ షోలతో బిజీగా మారింది. మళ్ళీ ఇన్ స్టాగ్రామ్ లలో ఫోటోలు అప్లోడ్ చేస్తోంది. గణేష్ పండుగని కూడా పెద్దగా సెలెబ్రేట్ చేసుకొంది.