టబు నుంచి శిల్పకి వచ్చారా

Shilpa Shetty

మొదట టబు అనుకున్నారు. ఆ తర్వాత అనసూయ వైపు మొగ్గారు. కొన్నాళ్ళకు రమ్యకృష్ణ ఖరారు అయిందని వార్తలు వచ్చాయి. కరోనా లక్డౌన్ తర్వాత సీన్ మారింది. మళ్లీ కొత్త నేమ్ బయటికొచ్చింది. ఈసారి పేరు… శిల్పా శెట్టి.

ఇన్ని పేర్లు … నితిన్ నటించనున్న “అంధధూన్” రీమేక్ సినిమా కోసమే. బాలీవుడ్ మూవీ “అంధధూన్”లో కీలకమైన నెగెటివ్ పాత్రని టబు పోషించింది. కొంత విలనిజం ఉండాలి, కొంత సెక్సప్పీల్ తోడవ్వాలి ఆ రోల్ కి. టబు చించేసింది. సో… మొదట ఆమెనే అడిగారు కానీ తెలుగులో అదే పాత్ర చేసేందుకు ఆమె ఆసక్తి చూపలేదు. తర్వాత అనసూయ, రమ్యకృష్ణ పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ వర్కౌట్ కాలేదు. సో … ఇప్పుడు శిల్పా శెట్టిని అప్రోచ్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కానీ … శిల్పా శెట్టి కూడా కన్ఫర్మా అనేది ఇప్పుడే చెప్పలేం.

కరోనా గోల అయిపోవాలి. ఆ తర్వాత నితిన్… “రంగ్ దే”, “చెక్” అనే రెండు సినిమాలు పూర్తి చెయ్యాలి. అవి అయ్యాక… అంధధూన్ రీమేక్ షూటింగ్ షురూ చేస్తాడు. ఈ తతంగం అంతా పూర్తి అవ్వాలంటే మరో ఆరు నెలలు పైనే పడుతుంది. అప్పుడు చెప్పొచ్చు… శిల్పా శెట్టి గురించి. అప్పటివరకు ఊహాగానాలే.

Related Stories