షిర్డీ టెంపుల్ మూసివేత, నమ్రత ప్రార్థన


మహారాష్ట్రలో కోవిడ్ విలయతాండవం చేస్తోంది. సెకండ్ వేవ్ లో కరోనా కేసులు రికార్డ్ సంఖ్యలో నమోదు అవుతున్నాయి. దాంతో… మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మరోసారి లాక్డౌన్ విధించాలని ఆలోచన చేస్తున్నారు. మరోవైపు, అక్కడ దేవాలయాలను స్వచ్చంధంగా మూసివేస్తున్నారు. లేటెస్టుగా షిర్డీ టెంపుల్ ని మూసివేయాలని నిర్ణయించింది షిరిడీ దేవస్థానం బోర్డు.

ఈ నెలాఖరు వరకు మూసి ఉంచుతారు. పూజ కార్యక్రమాలు యధావిధిగా సాగుతాయి… కానీ భక్తులకు ప్రవేశం లేదు. ఈ వార్త తెలిసిన వెంటనే మహేష్ బాబు భార్య నమ్రత స్పందించారు. ఆమె షిర్డీ సాయి భక్తురాలు. ఆమె రెగ్యులర్ గా షిర్డీ వెళ్లి దర్శనం చేసుకుంటారు. “మంచి రోజులు త్వరగా రావాలని ప్రార్థిస్తున్నా,” అంటూ ఆమె షిర్డీ సాయి ఫోటోని షేర్ చేశారు.

More

Related Stories