ఈ భామ సెలెక్షన్ హీరోదే!

Shirley Setia

తెలుగు తెరకు మరో అందాల భామ పరిచయం అవుతోంది. ఆ ముద్దుగుమ్మ పేరు… షిర్లీ సెటియా. పైగా ఈ భామ ఎన్నారై. న్యూజీలాండ్ లో పెరిగింది. అక్కడ సింగర్ గా పాపులర్. ఆ తర్వాత రెండు హిందీ సినిమాల్లో నటించింది.

షిర్లీని తెలుగు తెరకు పరిచయం చేస్తున్నది హీరో నాగశౌర్య. అవును… అతనే ఆమెని సెలెక్ట్ చేశాడట. నాగశౌర్య కథానాయకుడిగా అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వంలో రూపొందిన ‘కృష్ణ వ్రింద విహారి’ అనే చిత్రంలో ఆమె హీరోయిన్ నటించింది. ఈ చిత్రంతో షిర్లీ సెటియా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది.

ఈ సినిమా నాగశౌర్యకి సొంత సినిమా. సో.. తానే హీరోయిన్లను సెలెక్ట్ చేసుకునే బాధ్యత తీసుకున్నాడట. ఆమె పాడిన వీడియో ఆల్బమ్ చూసి సెలెక్ట్ చేశాడట. ‘ఛలో’ సినిమాతో తెలుగు తెరకు రష్మికని పరిచయం చేసింది కూడా నాగశౌర్య. ఇప్పుడు రష్మిక టాప్ హీరోయిన్ గా స్థిరపడింది. షిర్లీకి కూడా అలాంటి బ్రేక్ వస్తుందా?

‘కృష్ణ వ్రింద విహారి’ శుక్రవారం (సెప్టెంబర్ 23) థియేటర్లలోకి వస్తోంది. ఆమె జాతకం రేపు తేలుతుంది.

 

More

Related Stories