
యాంకర్ శివజ్యోతికి కూడా రూమర్లు తప్పడం లేదు. ‘బిగ్ బాస్ 3’ షోతో పాపులర్ అయ్యారు శివజ్యోతి. టీవీ9లో “ఇస్మార్ట్ న్యూస్”, అంతకుముందు వీ6లో “తీన్మార్” కార్యక్రమాల్లో సావిత్రి అక్కగా ఆమె పరిచితమే.
శివజ్యోతి గురించి కూడా సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. ఆమె గర్భవతి అయినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం షికారు చేస్తోంది. ఐతే, ఆమె అవన్నీ అబద్దాలు అని తెలిపింది. “నేను ప్రెగ్నెంట్ అంటూ ఫేక్‌న్యూస్ సృష్టిస్తున్నారు. ఇష్టం వచ్చినట్లు థంబ్‌నైల్స్ వేస్తున్నారు. ఏమైనా ఉంటే నేనే చెప్తా,” అని ఆమె ఒక వీడియో పెట్టింది.
ఆమెకి పెళ్లయి చాలా ఏళ్ళు అయింది. ఐతే, ఇంకా పిల్లలు కలగలేదు.
“నా జీవితంలో ఇది పెద్ద విషయం. నా లైఫ్‌లో నిజంగా గుడ్‌న్యూస్ ఉంటే నేనే మీ అందరితో షేర్ చేస్తాను… మీకో దండంరా బాబు… ఇలాంటి వార్తలు మాత్రం సృష్టించొద్దు,” అని తన వీడియోలో పేర్కొంది.