
దర్శకుడు శివ నిర్వాణ తన సినిమా గురించి వినిపిస్తున్న పుకార్ల గురించి స్పందించారు. ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ సినిమాల తర్వాత ఆయన తీసిన మూడో మూవీ… టక్ జగదీష్. నాని హీరోగా నటించాడు. నానికి సోదరుడిగా జగపతి బాబు కనిపిస్తాడిందులో. ఈ నెల 23న విడుదల కానున్న ‘టక్ జగదీష్’కి, 1992లో రాజశేఖర్, శోభన్ బాబు హీరోలుగా వచ్చిన ‘బలరామకృష్ణులు’ సినిమా కథకి లింక్ ఉన్నట్లు జరుగుతున్న ప్రచారానికి ఎండ్ కార్డు పడింది.
“ఇద్దరు అన్నదమ్ముల కథ తీస్తే బలరామకృష్ణులు అయిపోతుందా? భార్యాభర్తల స్టోరీ తీస్తే మౌనరాగం అవుతుందా? అమాయకత్వం కలిగిన వాడు పెద్దింటి అమ్మాయితో ప్రేమలో పడినట్లు తీస్తే… చంటి సినిమా తీశామని అంటారా? ఒకే పాయింట్ మీద అనేక సినిమాలు వస్తాయి, వచ్చాయి. కానీ ఫలానా సినిమాకి కాపీ అంటే ఎలా,” ఇలా శివ నిర్వాణ క్లారిటీ ఇచ్చారు.
‘టక్ జగదీష్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ నిర్మిస్తోంది.