
రాజశేఖర్ నటించిన తాజా సినిమా ‘శేఖర్’. ఇందులో ఆయన పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాలోనూ రాజశేఖర్ కుమార్తె పాత్రలో శివాని నటించారు.
కృష్ణ – మహేష్ బాబు, చిరంజీవి – రామ్ చరణ్ ఇలా తండ్రీకొడుకులు కలిసి నటించడం సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్. రాజశేఖర్ తన కూతురితో కలిసి మూవీ చెయ్యడం విశేషం. శివాని ఇప్పటికే రాఘవేంద్రరావు తీసిన ‘పెళ్లి సందD’, ‘www’, ‘అద్భుతం’ వంటి చిత్రాల్లో నటించింది.
హీరోగా రాజశేఖర్ 91వ సినిమా శేఖర్. జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహించారు. “రాజశేఖర్, శివాని మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నిజ జీవితంలో ఎలా ఉంటారో… సినిమాలో కూడా అలాగే ఉన్నారు. వారిద్దరూ చాలా సహజంగా చేశారు,” అని చెప్పారు దర్శకురాలు జీవితా రాజశేఖర్.
ఈ సినిమా రిలీజ్ డేట్ ని ఇంకా ప్రకటించలేదు. అన్ని పరిస్థితులు బాగుంటే ఫిబ్రవరి 4న విడుదల చేద్దామని భావిస్తున్నారు.