వాటి కోసం వెయిట్ చేస్తున్నా: శివాని

Shivani

నవంబర్ 24న విడుదల కానుంది ‘కోట బొమ్మాళి పీఎస్‌’. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించింది శివాని రాజశేఖర్. ఇది మలయాళంలో బాగా ప్రశంసలు అందుకున్న “నాయట్టు” చిత్రానికి తెలుగు రీమేక్. తేజ మార్ని డైరెక్ట్ చేయగా బన్నీ వాస్, విద్యా కొప్పినీడి నిర్మించారు.

శ్రీకాకుళం స్లాంగ్

“నేను తమిళ్ లో నటించిన ఒక సినిమా చూసి దర్శకుడు తేజ నాకు ఈ సినిమాలో పాత్ర ఇచ్చారు. ఇది ‘నాయట్టు’ చిత్రానికి రీమేక్ కానీ చాలా మార్పులు చేశారు. ఒరిజినల్ చూసినవారు కూడా ఈ సినిమాను ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. ఇందులో పోలీస్ కానిస్టేబుల్ పాత్ర కోసం శ్రీకాకుళం స్లాంగ్ కూడా నేర్చుకున్నా. ఆ యాసలోనే డైలాగ్ లు చెప్పాను.

నా గెటప్ కోసంమా నాన్నగారు కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. ఆయన ఎన్నో చిత్రాల్లో పోలీస్ పాత్రలు పోషించారు కదా.

లింగిడి లింగిడి వైరల్ సాంగ్

“లింగిడి లింగిడి” పాట వైరల్ కావడంతో నేను ఎక్కడికి వెళ్లినా ఈ పాట గురించే మాట్లాడుతున్నారు. ఈ పాట వల్లే ‘కోటబొమ్మాలి’ సినిమాకు మంచి బజ్ వచ్చింది.

స్లో అండ్ స్టడీ

Shivani

నచ్చింది చేసుకుంటూ పోవాలి. వచ్చింది చెయ్యాలి. విజయాలు వాటంతట అవే వస్తాయి. గ్లామర్ రోల్స్ కూడా చేయాలని ఉంది. వాటి కోసం వెయిట్ చేస్తున్నా.

Advertisement
 

More

Related Stories