అవి చెయ్యలేక వదులుకుందట!

Shivani

హీరోయిన్ శివాని రాజశేఖర్ తాజాగా ‘కోటబొమ్మాళి PS’ సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చింది. ఈ సినిమాలో ఆమె లేడి కానిస్టేబుల్ గా నటించింది. పూర్తిగా అభినయానికి మాత్రమే ప్రాధాన్యం ఉన్న పాత్ర అది. రాజశేఖర్ పెద్ద కూతురుగా ఆమె సినిమా రంగంలోకి అడుగుపెట్టి చాలా కాలం అయింది. ఐతే ఇప్పటివరకు పెద్ద హిట్ దక్కలేదు.

ఐతే, “ఉప్పెన” సినిమా మాత్రం తాను వదులుకోవాల్సి వచ్చిందనీ, లేకపోతే తన కెరీర్ వేరేగా ఉండేది అని ఈ అమ్మడు తాజాగా వెల్లడించింది.

“ఉప్పెనలో హీరోయిన్ గా మొదట నన్నే తీసుకున్నారు. దర్శకుడు బుచ్చిబాబు మొదట చెప్పిన కథలో చాలా ఇబ్బందికరమైన సీన్లు ఉన్నాయి. ముఖ్యంగా హీరోతో సెక్స్ సీన్లు శృతి మించినట్లుగా అనిపించింది. దాంతో, నేను అలాంటి సన్నివేశాలు చేయలేను అని వద్దని చెప్పాను. తర్వాత కథలో చాలా మార్పులు జరిగాయి. ఆ సీన్లు లేవు. కానీ అప్పటికే వాళ్ళు కృతి శెట్టిని తీసుకున్నారు. మొదట చెప్పిన సీన్లు కాకుండా ఇప్పుడు మనం చూసిన “ఉప్పెన” సీన్లు చెప్పి ఉంటే వెంటనే ఒప్పుకునే దాన్ని,” అని చెప్పింది.

అలా ఈ భామ ఒక హిట్ సినిమాని వదులుకుందన్నమాట. ఐతే, ఇప్పుడు గ్లామర్ పాత్రలైనా, నాన్ గ్లామర్ పాత్రలైనా సిద్ధం అంటోంది.

Advertisement
 

More

Related Stories