
హీరో రాజశేఖర్, జీవిత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ఇద్దరూ హీరోయిన్లుగా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. ఇద్దరిలో మొదట గుర్తింపు తెచ్చుకున్న భామ చిన్న అమ్మాయి. ‘దొరసాని’ సినిమాతో ఆమె అడుగుపెట్టింది శివాత్మిక. తర్వాత కృష్ణవంశీ తీసిన ‘రంగమార్తాండ’లో అవకాశం పొందింది. కానీ సడెన్ గా ఆమె కెరీర్ కి బ్రేకులు పడ్డాయి.
,
ఇప్పుడు పెద్ద కూతురు బిజీ అయిపోయింది. రాజశేఖర్ పెద్ద కూతురు శివాని ఇప్పటికే ‘పెళ్లి సందD’, ‘అద్భుతం’, ‘శేఖర్’ చిత్రాలతో పాటు ఒక తమిళ్ మూవీ చేసింది.
ఇప్పుడు ఆమె చేతిలో రెండు కొత్త సినిమాలు, ఒక వెబ్ డ్రామా ఉంది. ఎక్కువగా వెబ్ కంటెంట్ పై ఫోకస్ పెట్టింది. అంతే కాదు, సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోషూట్ లతో ఫాలోవర్స్ పెంచుకుంటోంది.

ఓవరాల్ గా శివాత్మిక దూసుకుపోతుందేమో అనుకుంటే శివాని హంగామా ఎక్కువ ఉంది. ఐతే, హీరోయిన్ గా ఇంకా పాపులారిటీ, క్రేజ్ మాత్రం రాలేదు.
ALSO Check: Shivani Rajashekar casual pose