- Advertisement -

శివాత్మిక రాజశేఖర్ “దొరసాని”గా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమా ఆడకపోయినా ఆమె నటన, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకున్నాయి. ఈ పిల్ల హీరోయిన్ గా నిలబడుతుంది అని సినిమా ఇండస్ట్రీ జనాలు అప్పుడు అన్నారు.
ఐతే, ఈ ఐదు ఏళ్లల్లో ఈ భామకి కేవలం నాలుగు ఛాన్స్ లు మాత్రమే వచ్చాయి. తెలుగులో రెండు సినిమాలు, తమిళంలో రెండు. ఒక్కటీ ఆడలేదు. అంతే, ఇండస్ట్రీ పట్టించుకోవడం మానేసింది. ప్రస్తుతం ఈ భామ కేవలం ఇన్ స్టాగ్రామ్ కే పరిమితం అయింది.
రాజశేఖర్, జీవిత దంపతుల చిన్న కూతురు… శివాత్మిక. ఆమె అక్క శివాని హీరోయిన్ గా తెలుగు, తమిళంలో అడపాదడపా అవకాశాలు దక్కించుకుంటోంది. కానీ శివాత్మికకి “రంగమార్తాండ” తర్వాత మరో ఆఫర్ రాలేదు.
ఇప్పుడు ఈ అమ్మడు ఏమి చేస్తుందో మరి.