కన్నడ ‘ఘోస్ట్’గా శివన్న

నాగార్జున ‘ది ఘోస్ట్’ పేరుతో ఒక యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు రెడీ అవుతోంది. ఇక ఇప్పుడు కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ శివరాజ్ కుమార్ కూడా అదే పేరుతో ఒక మూవీ చేస్తున్నారు. ఆయన కొత్త చిత్రం పేరు ‘ఘోస్ట్’. ఈ సినిమాని పాన్ ఇండియా ఫిలిం గా కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కించనున్నారట.

కన్నడలో హిట్టయిన ‘బీర్బల్’ చిత్ర దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని నిర్మాత సందేశ్ నాగరాజ్ నిర్మించనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఈ రోజు శివరాజ్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు.

యాక్షన్ హైస్ట్ థ్రిల్లర్ జానర్ లో రూపొందనుందట ‘ఘోస్ట్’.

బీర్బల్ కి సంభాషణలు రాసిన ప్రసన్న వి ఎం ‘ఘోస్ట్’ కి డైలాగ్స్ రాస్తున్నారు. కె జి ఎఫ్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆర్ట్ డైరెక్టర్ శివ కుమార్ ఈ సినిమాకి పనిచేస్తున్నారు. ఆగస్ట్ చివరి వారంలో ‘ఘోస్ట్’ చిత్రీకరణ ప్రారంభం కానుంది.

 

More

Related Stories