మరో కోరిక నెరవేరింది!

శ్రద్ధ దాస్ తన మరో కోరిక తీరిందని చెప్తోంది. పవర్ ఫుల్ లేడీ పోలీస్ పాత్రలో నటించాలనేది ఆమె అభిలాష. అంటే విజయశాంతిలా పేరు తెచ్చుకోవాలనేది కల. అది ఇప్పుడు నెరవేరింది.

శ్రద్ధ దాస్ ఇటీవల తన ఫోకస్ అంతా వెబ్ సిరీసుల వైపు మళ్లించింది. తాజాగా హిందీలో ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది. షూటింగ్ మొదలైంది. ఖాకి దుస్తులు వేసుకొని రాయల్ ఎంఫిల్డ్ బైక్ మీద వెళ్లే పాత్ర కావడంతో… ఆ ఫోటోలను షేర్ చేసింది. జీవితంలో మరో కోరిక తీరింది అని పోస్ట్ చేసింది.

గుంటూరు టాకీస్, గరుడ వేగా వంటి హిట్ సినిమాల్లో నటించిన శ్రద్ధ దాస్ కి రీసెంట్ గా తెలుగులో అవకాశాలు తగ్గాయి. దాంతో ఆమె తన లక్ ని బాలీవుడ్ లో టెస్ట్ చేసుకుంటోంది. అక్కడ వెబ్ సిరీస్ ల్లో మంచి ఆఫర్లు వస్తున్నాయి.

Related Stories