60 మిలియన్ల ఫాలోవర్స్

Shraddha Kapoor

శ్రద్ధ కపూర్ కున్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో అత్యధిక పాపులారిటీ ఉన్న బాలీవుడ్ హీరోయిన్స్ లలో శ్రద్ధ ఒకరు. ఈ భామ ఇప్పుడు ఏకంగా 60 మిలియన్ల ఫాలోవర్స్ ని పొందింది. ఇన్ స్టాగ్రామ్ లో ఈ రేంజులో ఫాలోవర్స్ మరో హీరోయిన్ కి లేరు. దీపిక పదుకోన్, అలియా భట్ లని దాటిపోయింది.

ప్రియాంక చోప్రా మాత్రం 62 మిలియన్ల ఫాలోవర్స్ శ్రద్ధకన్నా ముందు వరుసలో ఉంది. కాకపొతే, ప్రియాంకకి హాలీవుడ్ లో ఫేమ్ రావడం వల్ల అంత పాపులారిటీ వచ్చింది. శ్రద్ధ కేవలం బాలీవుడ్ సినిమాలతోనే ఇంత క్రేజ్ తెచ్చుకోవడం విశేషం.

ఏ హీరోయిన్ కి ఎంత ఫాలోయింగ్?

ప్రియాంక చోప్రా – 62 మిలియన్లు
శ్రద్ధ కపూర్ – 60 మిలియన్లు
దీపిక పదుకోన్ – 55 మిలియన్లు
ఆలియా భట్ – 52 మిలియన్లు
కత్రినా కైఫ్ – 48 మిలియన్లు
సన్నీ లియోన్ – 46 మిలియన్లు
దిశా పటాని – 43 మిలియన్లు
కృతి సనన్ – 38 మిలియన్లు
కియారా అద్వానీ – 17 మిలియన్లు
అనన్య పాండే – 17 మిలియన్లు
జాన్వీ కపూర్ – 10 మిలియన్లు

More

Related Stories