శ్రద్ద పెళ్ళికి ఒకే చెప్పిన మామయ్య!

Shraddha Kapoor

శ్రద్ధ కపూర్ చాలా కాలంగా తన చిన్ననాటి స్నేహితుడు రోహన్ శ్రేష్ఠతో ప్రేమలో ఉంది. అతన్ని పెళ్లాడనుందని వార్తలు వస్తున్నాయి. ఆమె నిజంగా రోహన్ ని పెళ్లాడాలనుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని ఆమె తండ్రి శక్తి కపూర్ ఇప్పటికే మీడియాకి చెప్పాడు. ఐతే, తన కూతురు ఇప్పటి వరకు పెళ్లి ప్రస్తావన తేలేదు అని ఆయన చెప్పాడు.

లేటెస్ట్ గా రోహన్ తండ్రి కూడా అదే మాట మీడియాతో చెప్పాడు. “నా కొడుకు శ్రద్ధ కపూర్ ని పెళ్లి చేసుకోవాలంటే… ఆనందంగా ఒప్పుకుంటాం. కొడుకు ఇష్టాన్ని కాదనే వ్యక్తిత్వం కాదు మాది,” అని ఆయన కుండబద్దలు కొట్టాడు. అటు శ్రద్ధ కపూర్ తండ్రి, ఇటు ‘కాబోయే మావయ్య’ ఇద్దరూ బహిరంగంగా ఒకే చెప్పారు. మరి శ్రద్ద పెళ్లి కబురు ఎప్పుడు చెప్తుందో?

తెలుగులో సాహో సినిమాలో నటించిన శ్రద్ధ బాలీవుడ్ లో లీడింగ్ హీరోయిన్.

More

Related Stories