లవ్, కెరీరూ ట్రాక్ తప్పాయి

- Advertisement -

శ్రద్ధ కపూర్ ఎక్కడో ఉండాల్సింది. ఎక్కడో ఉంది. ‘చిచోరే’ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత ఆమె కెరీర్ మరింత దూసుకెళ్తుంది అనుకున్నారంతా. ‘సాహో’ కూడా హిందీలో బాగానే ఆడింది. కానీ, అదేంటో ఈ రెండు సినిమాలు విడుదలయ్య్యాక ఆమె కెరీర్ స్లో అయింది.

రోహన్ అనే తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకోవాలని భావించింది. కానీ, ఆ బంధంలో పగుళ్లు వచ్చాయి. ఆల్మోస్ట్ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారనే మాట వినిపిస్తోంది. పెళ్లి ఆలోచనలో కెరీర్ ని పట్టించుకోలేదు. ఇప్పుడు రణబీర్ కపూర్ సరసన లవ్ రంజన్ డైరెక్షన్లో ఒక మూవీ చేస్తోంది. ఇది విడుదలయి ఆడితే, ఆమె కెరీర్ కి మళ్ళీ ఊపొస్తుంది.

ఈ 35 ఏళ్ల సుందరి చేతిలో ప్రస్తుతం ఈ ఒక్క మూవీ మాత్రమే ఉందంటే నమ్ముతారా? ఎంతో బిజీగా ఉండాల్సిన ఈ భామకి ఇటు పాన్ ఇండియా సౌత్ సినిమాల్లో కూడా ఆఫర్లు రావట్లేదు.

ఇన్ స్టాగ్రామ్ లో 71 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. దీన్ని బట్టి చెప్పొచ్చు ఆమెకి యూత్ లో క్రేజుందని. కానీ, ఆమె ప్రేమ, ప్రియుడు మోజులో సినిమాలని కేర్ చెయ్యలేదు. ఇప్పుడు మళ్ళీ ట్రాక్ లోకి తెచ్చుకోవాలి.

 

More

Related Stories