చెప్తే పెళ్లి చేస్తా: శ్రద్ధ తండ్రి

Shraddha Kapoor

‘సాహో’ సుందరి శ్రద్ధా కపూర్ పెళ్లి గురించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. బాయ్ ఫ్రెండ్ రోహన్ తో ఆమె పెళ్లి ఫిక్స్ అయింది అని ఇటీవల బాలీవుడు పత్రికలు తెగ రాశాయి. రాజస్థాన్ లోని ఒక రిసార్ట్ కూడా బుక్ అయిందని, అక్కడే పెళ్లి అనేది ఆ వార్తల సారాంశం. ఐతే, శ్రద్ధా కపూర్ తండ్రి మాత్రం తన కూతురు పెళ్లి మాట ఎత్తలేదని అంటున్నారు.

ఆమె తండ్రి శక్తి కపూర్ ఫేమస్ నటుడే. తన కూతురు ఎవరిని ప్రేమించినా అభ్యంతరం చెప్పను, కానీ శ్రద్ద ఇంతవరకు ఫలానా వ్యక్తిని ఇష్టపడుతున్నట్లు చెప్పలేదట. రోహన్ కానీ, ఇంకా ఎవరైనా కానీ, నా కూతురు నచ్చిన వాడికి చేస్తాను అంటూ క్లారిటీ ఇచ్చారు.

మరి శ్రద్ధ కపూర్ సడెన్ గా సినిమాలు ఎందుకు తగ్గించిందో.

More

Related Stories