
లతా మంగేష్కర్, ఆశా భోస్లే, పి. సుశీల, ఎస్. జానకి, చిత్ర వంటి గొప్ప గాయనీమణుల సరసన చేరిన గాయని శ్రేయ ఘోషల్. ఈ తరంలో ఆమెకి సాటి వచ్చేవారు లేరు. హిందీ అయినా, తెలుగు అయినా, తమిళం అయినా, బెంగాలీ అయినా… భాష ఏదైనా ఆమె గాత్రం మధురం. ఆమె ఉచ్చారణ స్పష్టం.
ఆమె పడిన పాటల్లో 90 శాతం పాపులర్ అయ్య్యాయి. ఆమె విజయ రహస్యం ఏంటి?
“నేను ఎక్కువగా ఆలోచించను. ఆ క్షణంలో ఏమి అనిపిస్తే అలాగే ఉంటాను. అలాగే పాడుతాను. చేసే ప్రతిపనికి నా వంద శాతం ఎఫర్ట్ పెడతాను. మనసు పెట్టి పాడుతాను. బహుశా ఇదే నా సక్సెస్ మంత్రం కావొచ్చు,” అని చెప్తోంది శ్రేయ ఘోషల్.
ఇటీవల ‘రాధే శ్యామ్’, ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘రంగ రంగ వైభవంగా’ వంటి చిత్రాల్లో పాడిన శ్రేయ త్వరలో విడుదల కానున్న ‘గాడ్ ఫాదర్’లో ఐటెం సాంగ్ పాడారు. చిరంజీవి, సల్మాన్ ఖాన్, ఐటెం భామపై ఈ పాట చిత్రీకరించారు.
శ్రేయ, శ్రేయ ఘోషల్,