మాతృత్వపు మధురిమ!

శ్రియ మాతృత్వపు మధురిమని పూర్తిగా ఆస్వాదిస్తోంది. ఒకప్పుడు తన ఇన్ స్టాగ్రామ్ నిండా ఎక్స్ పోజింగ్ ఫొటోలతో నింపుతుండేది. లేదంటే… తన భర్తకి ముద్దులు పెట్టె ఫోటోలను, వీడియోల్ని షేర్ చేసేది. మొత్తమ్మద, ఆమె టైంలైన్లో ఎక్కువగా “అడల్ట్” కంటెంట్ కనిపించేది.

ఇప్పుడు మొత్తం తన కూతురు ఫోటోలు, వీడియోల్ని షేర్ చేస్తోంది. కూతురు రాధని ముద్దు చేసే ముచ్చట్లు, ఆడించే ఆటలు, తన ఆనంద గడియలు రికార్డు చేసి వాటిని అప్లోడ్ చేస్తోంది.

శ్రియ నటించిన “ఆర్ ఆర్ ఆర్” సినిమాకి ఇంకా కొత్త విడుదల తేదీ ఫిక్స్ కాలేదు. “ఆర్ ఆర్ ఆర్”లో ఆమె అజయ్ దేవగన్ సరసన నటించింది.

“అంతులేని ఆనందాన్ని నీ వల్ల వస్తోంది. నువ్వే నా హార్ట్ బీట్,” అంటూ తన కూతురిపై ప్రేమని చూపుతోంది శ్రియ. ఆమె రష్యాకి చెందిన వ్యాపారవేత్త ఆంద్రీని పెళ్లాడింది. కొన్నాళ్ళూ స్పెయిన్ లోని బార్సిలోనాలో కాపురం పెట్టింది ఈ జంట. కూతురు పుట్టాక ఇండియాకి షిఫ్ట్ అయ్యారు.
 

More

Related Stories