ఇండియాలోనే సెటిలవుతోన్న శ్రియా!

- Advertisement -
Shriya saran

శ్రియా పెళ్లి చేసుకున్న తర్వాత స్పెయిన్ లో సెటిల్ అయింది. భర్త ఆండ్రీ కొస్చెవ్ తో కలిసి స్పెయిన్ లోని బార్సిలోనా నగరంలో కాపురం పెట్టింది. మూడేళ్ళ తర్వాత ఆమెకి ఇండియాకి తిరిగి రావాలని అనిపించిందట. 2018లో ఆమె పెళ్లి సింపుల్ గా ముంబైలో జరిగింది. ఇప్పుడు మూట ముల్లె సర్దుకొని ఇండియాకి వస్తోంది.

ఇకపై ఇక్కడే ఉంటాం అని చెప్తోంది. “Moving back to India. Missing the homies. Namaste. Bye Bye” (ఇండియాకి తిరిగి వస్తున్నాము. ఇంటిని మిస్ అవుతున్నా. నమస్తే… బై బై) అని తన ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొంది.

శ్రియా, ఆమె భర్త ఇక ముంబైలో కాపురం పెడుతారు. 37 ఏళ్ల శ్రియాకి ఇంకా పిల్లలు కలగలేదు.

Also Check: Shriya sizzles in new glam pics

ఆమె బాలీవుడ్ లోనూ, టాలీవుడ్ లోనూ మళ్ళీ కెరియర్ స్టార్ట్ చెయ్యాలనే ఆలోచనలో ఉందట. ఇప్పటికే ఆమె నటించిన ‘గమనం’ అనే తెలుగు సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. రాజమౌళి తీస్తున్న “ఆర్ ఆర్ ఆర్” సినిమాలో కూడా చిన్న పాత్ర పోషిస్తోంది శ్రియా.

 

More

Related Stories