
శ్రియకి పెళ్లి అయింది. ఒక పాప కూడా పుట్టింది. కూతురు పుట్టిన తరువాత భర్తతో కలిసి ఇండియాకి తిరిగొచ్చి ముంబైలో సెటిల్ అయింది. ఇప్పటికే సీనియర్ హీరోలకు భార్యగా నటిస్తున్న శ్రియ మాత్రం ఇంకా గ్లామర్ రూట్ వదల్లేదు.
అందాల ప్రదర్శనతో కూడిన ఫోటోషూట్లు చేస్తూ, వాటిని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఇంకా హడావుడి చేస్తోంది.
ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోషూట్లతో ఆమె ఫిలింమేకర్స్ కి హింట్ ఇస్తోంది తాను ఇప్పటికీ గ్లామర్ పాత్రలు చెయ్యగలను అని. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో తల్లి పాత్ర పోషించిన ఈ బ్యూటీ ఇప్పుడు ఆఫర్ల కోసం చూస్తోంది. ఇండియాకి తిరిగి వచ్చిందే నటిగా బిజీ కావాలని. అందుకే, ఆఫర్ల కోసం ఈ కొత్త ఫోటోషూట్ లు.
Check out Shriya’s new photoshoot pics
2001 నుంచి తెలుగులో నటిస్తోంది శ్రియ. అంటే దాదాపు 20 ఏళ్ల కెరియర్. ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్ కోసం తహ తహ.