తన వల్ల కాదంటున్న శృతి

తనకు ఒంటరిగా ఉండడం ఇష్టమని ఇప్పటికే ప్రకటించింది హీరోయిన్ శృతిహాసన్. మరీ ముఖ్యంగా ముంబయిలోని తన ఫ్లాట్ లో ఓ గుహ లాంటి ప్రదేశంలో గడపడం ఇంకా ఇష్టమని చెప్పుకొచ్చింది. ఈ లాక్ డౌన్ టైమ్ అంతా తను ఒంటరిగానే ఉన్నానని, బాగా ఎంజాయ్ చేశానని వెల్లడించిన శృతిహాసన్.. ఓ విషయంలో మాత్రం చాలా బాధ పడుతోంది.

ఇళ్లంతా క్లీన్ గా ఉంచుకోవడం తనకు చాలా ఇబ్బందిగా మారుతోందంటోంది శృతిహాసన్. ఓవైపు ఇష్టమైన వంటలు చేసుకుంటున్నా, కిచెన్ శుభ్రం చేయడానికి కష్టంగా ఉందని.. అలానే ఇంట్లో ఉంటున్నప్పటికీ రోజూ గదులు క్లీన్ చేయడం ఇబ్బందిగా ఉందని చెబుతోంది.

మరీ ముఖ్యంగా ఫుల్లుగా ఎక్సర్ సైజులు చేసిన వచ్చిన తర్వాత ఇల్లు శుభ్రం  చేయాలంటే ఇంకా కష్టం అంటోంది ఈ బ్యూటీ. ఇప్పుడిప్పుడే బయటకొస్తోంది శృతిహాసన్. మొన్ననే ఓ యాడ్ లో నటించింది. త్వరలోనే సినిమా సెట్స్ పైకి కూడా రాబోతోంది.

Related Stories