శృతి హాసన్ డ్రెస్సులు, టాట్టూలు!

Shruti Haasan

హీరోయిన్ శృతి హాసన్ కి టాటూస్ అంటే చాలా ఇష్టం. ఆమె శరీరంపై ఐదు టాట్టూస్ ఉన్నాయట. భుజంపై ఒకటి, చేతిపై ఒకటి, ఎదపై ఒకటి, మెడవంపులో మరోటి… ఇలా టట్టూస్ ఉన్నాయి. వాటిని అనేక సందర్భాల్లో తన ఇన్ స్టాగ్రామ్ ఫోటోల ద్వారా చూపించింది.

“టాటూస్ విషయంలో ఎక్కువగా ఆలోచించను. టాట్టూస్ అంటే తెగ పిచ్చి. ఇప్పటికే చాలా వేయించుకున్నాను. కొత్తగా వేయించుకోవాలా వద్దా అనేది నా మూడ్ ని బట్టి అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటాను. ప్రస్తుతానికి ఉన్నవి చాలు అనిపిస్తోంది,” అని చెప్పింది శృతి.

అలాగే డ్రెస్సింగ్ విషయంలో కూడా తన అభిరుచి మిగతా అమ్మాయిలకు భిన్నంగా ఉంటుంది. ఆమె ఎక్కువగా బ్లాక్ ధరిస్తుంటుంది.

“అది నిజమే నలుపు అంటే ఇష్టం. కానీ బ్లాక్ డ్రెస్సుల్లో నన్ను చూసి బోర్ కొడుతోందని అభిమానులు అంటున్నారు. ఇప్పుడు స్టయిల్ మార్చే ఆలోచనలో ఉన్నాను,” అని తెలిపింది శృతి.

శృతి హాసన్ ప్రస్తుతం అడివి శేష్ తో “డకాయట్” అనే సినిమా చేస్తోంది.

Advertisement
 

More

Related Stories