ట్రెండింగ్ లో శృతి హాసన్


చాలా కాలం తర్వాత శృతి హాసన్ గురించి మనం మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే, ఆమె సడెన్ గా బిజీ అయింది. అంతేకాదు, ఒకేసారి రెండు పెద్ద సినిమాల్లో కనిపిస్తోంది. 2023 సంక్రాంతి ఆమెదే.

బాలయ్య హీరోగా నటించిన ‘వీరసింహ రెడ్డి’లో శృతి హాసన్ హీరోయిన్. ఇక ‘వాల్తేర్ వీరయ్య’లో చిరంజీవితో స్టెప్పులు వేసే శ్రీదేవి కూడా శృతినే. ఈ రెండు చిత్రాలు ఒక రోజు గ్యాప్ లో విడుదల అవుతున్నాయి. ఈ సినిమాల పాటల ప్రమోషన్స్ ఇప్పుడు జోరుగా సాగుతున్నాయి. దాంతో, సోషల్ మీడియాలో శృతి హాసన్ నిత్యం ట్రెండింగ్ లోకి వస్తోంది.

సంక్రాంతి సినిమాలు హిట్ ఐతే వచ్చే వసూళ్లు మామూలుగా ఉండవు. అలాగే, ఈ సినిమాల్లో నటించిన హీరోయిన్లకు క్రేజ్ కూడా మారిపోతుంది. సో మళ్ళీ శృతికి బ్రైట్ డేస్ వచ్చినట్లే.

ఈ రెండు సినిమాలు విడుదలయ్యాక, వాటి ఫలితాలను బట్టి ఈ అమ్మడు కొత్త సినిమాలు ఒప్పుకుంటుంది. ప్రస్తుతం ప్రభాస్ సరసన ‘సలార్’లో నటిస్తోంది.

ఇక సోషల్ మీడియా వేదికపై బాయ్ ఫ్రెండ్ శాంతను హజారికాతో ఫోటోలు పెట్టడం మానేసింది. ఇప్పుడు కెరియర్ పై దృష్టి పెట్టింది.

 

More

Related Stories