35వ బర్త్ డే ఫుల్లు ఎంజాయ్

- Advertisement -
Shruti Haasan

సాధారణంగా హీరోయిన్లు తమ వయసు గురించి ఓపెన్ గా మాట్లాడరు. వయసుని దాచేస్తారు. శృతి హాసన్ మాత్రం తన 35వ బర్త్ డేని ఓపెన్ గా సెలెబ్రేట్ చేసుకొంది. 35 అని నంబర్ అనౌన్స్ చేస్తూ ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటోలో కూడా ఆమె 35వ బర్త్ డే అని రాసి ఉంది.

‘క్రాక్’ సినిమా సూపర్ హిట్ కావడం, ప్రభాస్ సరసన ‘సలార్’లో ఛాన్స్ రావడంతో శృతి ఈ పుట్టిన రోజును ఫుల్లు హ్యాపీగా సెలెబ్రేట్ చేసుకొంది. వయసు మీటర్ పెరుగుతోంది. కానీ పెళ్లి ముచ్చట ఎత్తడం లేదు. సడెన్ గా కెరీర్ కి బూస్ట్ రావడంతో ఇక వెడ్డింగ్ ప్లాన్ వాయిదా వేసుకున్నట్లే.

“జీవితంలో చాలా నేర్చుకున్నా. ఇప్పుడు బెస్ట్ పీరియడ్ లో ఉన్నాను. ఇక సింపుల్ లైఫ్ ని కొనసాగిస్తాను. క్రియేటివిటీకి ప్రాధాన్యం ఇస్తాను,” అంటూ పుట్టిన రోజు నాడు తన కొత్త ఫిలాసఫీని తెలిపింది. శృతి హాసన్ రెండు, మూడేళ్ళ క్రితం అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంది. దాంతో ఆమె లైఫ్ స్టయిల్ ని మార్చేసింది. ఇప్పుడు క్రమబద్ధమైన జీవితాన్ని లీడ్ చేస్తోంది.

ఈ ఏడాది ఆమె ‘వకీల్ సాబ్’తో మరోసారి ప్రేక్షకులను పలకరించనుంది.

 

More

Related Stories