నేను హాస్పిటల్ లో లేను: శృతి

Shruti


హీరోయిన్ శృతి హాసన్ మొన్న ఒక పోస్ట్ పెట్టింది ఇన్ స్టాగ్రామ్ లో. ఆ పోస్ట్ ని సరిగా చదవని యూట్యూబ్ ఛానెల్స్ చేసిన రచ్చతో ఆమె మళ్ళీ ఒక కొత్త వీడియో పెట్టి వివరణ ఇచ్చింది. యూట్యూబ్ ఛానెల్స్ చేసిన హంగామాతో ఆమె హాస్పిటల్లో చేరింది అని శృతి ఫ్రెండ్స్ కంగారు పడ్డారట.

“నేను బాగానే ఉన్నాను. నేను హాస్పిటల్ లో అడ్మిట్ కాలేదని ఈ వీడియో చూస్తే అర్థం అవుతోంది కదా,” అని తెలిపింది.

ఆమె చాలా ఏళ్లుగా PCOD (చాలా మంది ఆడవాళ్లు ఎదుర్కొనే సమస్యే)తో బాధ పడుతోంది. ఆ విషయాన్నీ తెలుపుతూ ఒక వర్కౌట్ వీడియోని షేర్ చేసింది. ఇలా చేస్తే తనలా ఆ సమస్యని ఎదుర్కొనే ఆడవాళ్ళకి కొంత మేలు జరుగుతుందని ఆమె రాసింది. కానీ, ఆమె ఎదో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నట్లు, దానికోసం ఆమె హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లుగా కొన్ని మీడియా సంస్థలు హడావిడి చేశాయట. దాంతో ఆమె ఇలా వివరణ ఇచ్చింది.

ప్రస్తుతం ఈ భామ ‘సలార్’ చిత్రంతో పాటు బాలకృష్ణ, చిరంజీవి కొత్త చిత్రాల్లో కూడా నటిస్తోంది. ఆమె చేతిలో ఉన్న మూడు చిత్రాలు కూడా తెలుగు సినిమాలే.

 

More

Related Stories