శృతిని కన్ ఫ్యూజన్లో పడేసిన పవన్

- Advertisement -

శృతి హాసన్ “వకీల్ సాబ్”లో హీరోయిన్. ఆమె డిసెంబర్ మొదటివారంలో షూటింగ్లో పాల్గొనాలి. ఐతే, డిసెంబర్ దాకా ఆగడం ఎందుకు ఈ మంతే మొత్తం షూటింగ్ ఫినిష్ చేద్దాం, శ్రుతి డేట్స్ కూడా నవంబర్లోనే అడగండి అని పవన్ కళ్యాణ్ గతవారం నిర్మాత దిల్ రాజ్ చెప్పాడు. ఐతే, పవన్ కళ్యాణ్ నిర్ణయాలు అన్ని ఆయన రాజకీయాలపై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు ఆయన మళ్లీ రాజకీయాల మీద ఫోకస్ పెట్టాల్సి వచ్చింది… జీహెచ్ఎంసీ ఎన్నికలు వల్ల.

సో… “వకీల్ సాబ్” షూటింగ్ మళ్ళీ డిసెంబర్ లోనే ఊపందుకుంటుంది. శృతి కూడా డిసెంబరులోనే మళ్ళీ డేట్స్ ఇవ్వాలి. ఆఫ్ కోర్స్, శృతికి కాల్షీట్ల సమస్య లేదు. ఆమె చేతిలో పెద్దగా సినిమాలే లేవు.

“వకీల్ సాబ్” విడుదల కూడా సంక్రాంతి నుంచి సమ్మర్ కి పోస్టుపోన్ అయింది. ఈ సినిమా షూటింగ్ మాత్రం వీలైనంత త్వరగా పూర్తి చేయించాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నారు.

 

More

Related Stories