శృతికి ‘కళాకారులే’ ఇష్టం!

శృతి హాసన్ మరోసారి తన పర్సనల్ లైఫ్ విషయాలతో వార్తల్లోకి వచ్చింది. ఆమె తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో కనిపించడంతో మరోసారి ఆమె లవ్ లైఫ్ గురించి బాలీవుడ్ మీడియా ఫోకస్ పెట్టింది.

35 ఏళ్ల శృతి హాసన్ ఇప్పటివరకు పలువురితో డేటింగ్ చేసింది. అందులో పలువువు హీరోలు కూడా ఉన్నారు. ధనుష్, నాగ చైతన్యతో ఆమెని లింకప్ చేస్తూ కూడా వార్తలు వచ్చాయి. అలాగే క్రికెటర్ సురేష్ రైనాతో ఆమె క్లోజ్ ఫ్రెండ్షిప్ గురించి కూడా గాసిప్స్ వచ్చాయి. కానీ ఆమె స్వయంగా ఒప్పుకున్న లవ్ స్టోరీలు మాత్రం రెండు.. ఒకటి హీరో సిద్ధార్థ్ తో. రెండోది ఇటాలియన్ మైఖేల్ కొర్సాల్ తో. మైఖేల్ తో ఆమె తన ప్రేమాయణాన్ని దాచుకోలేదు. తనే స్వయంగా ఫోటోలు పోస్ట్ చేసింది ఇన్ స్టాగ్రామ్ లో. అతన్ని తన బంధువులందరికి పరిచయం చేసింది. పెళ్లి వరకు వెళ్ళింది వీరి మ్యాటర్. కానీ లాస్ట్ ఇయర్ బ్రేకప్ అయింది వీరి మ్యాటర్.

ఇప్పుడు శాంతను హజారికాతో డేటింగ్ లో ఉంది శృతి. ఇతను ‘ఆర్ట్’ వేస్తుంటాడు. అలాగే మ్యూజిషియన్ కూడా.

ఒక్క సురేష్ రైనా తప్ప ఆమె ఇప్పటివరకు డేటింగ్ చూసినవారంతా నటన, మ్యూజిక్ రంగాలకు చెందినవారే. అంటే, ఆమెకు ‘కళాకారులు’ అంటేనే ఇష్టం అని అర్థమవుతోంది.

More

Related Stories